- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు: వస్తున్నాయ్ రుతుపవనాలు..!
రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతీ రుతుపవనాలు గురువారం కేరళ తీరాన్ని తాకనున్నాయని పేర్కొంది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Meteorological Department) చల్లని కబురు అందించింది. నైరుతీ రుతుపవనాలు(Southwest Monsoons) గురువారం కేరళ తీరాన్ని(Kerala coast) తాకనున్నాయని పేర్కొంది. దీంతో ఈ నెల 5న రాయలసీమ(Rayalaseema) ద్వారా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోకి ఇవి ప్రవేశిస్తాయని చెప్పారు. అనంతరం 10 నాటికి దక్షిణ కోస్తా ప్రాంతమంతటా విస్తరించి, జూన్ 15 నాటికి రాష్ట్రం మొత్తం ఈ రుతుపవనాలు వ్యాపిస్తాయని అధికారులు వెల్లడించారు.
వారం రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు
రుతుపవనాల రాకతో రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ఎండల తీవ్రత తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుందని వెల్లడించింది. ఆ తర్వాత మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఎండలు ఎక్కువైతే వానలు కురుస్తాయా?
ఈ ఏడాది ఎండలు ఎక్కువగా మండిపోయాయి కాబట్టి, వర్షాలు కూడా విపరీతంగా పడతాయనే ప్రచారంలో నిజం లేదని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ స్పష్టం చేశారు. ఎండల తీవ్రతకు, కురిసే వర్షాల పరిమాణానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండదని ఆయన వివరించారు. కాబట్టి ఎండలు ఎక్కువగా కాశాయని వర్షాలు భారీగా పడతాయని చెప్పలేమని జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు.






