రాజమండ్రి సెంట్రల్ జైలుకు పెద్దిరెడ్డి.. వైసీపీ కీలక నేతలు కూడా..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-05 08:17:40  IST  )

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిశారు..

రాజమండ్రి సెంట్రల్ జైలుకు పెద్దిరెడ్డి..  వైసీపీ కీలక నేతలు కూడా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(Liquor Case) రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సిట్ అధికారుల విచరణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరిన్ని ఆధారాల కోసం ముమ్మరంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Ycp Mp Mithun Reddy) అరెస్ట్ అయి జైలు(Jail)లో ఉన్నారు. దీంతో ఆయన్ను కలిసేందుకు తండ్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(MLA Peddireddy Ramachandra Reddy) వెళ్లారు. జైలు ములాఖత్‌లో మిథున్ రెడ్డిని కలిశారు. పెద్దిరెడ్డితో పాటు వైసీపీ నేతలు తలశిల రఘురాం(Former YSRCP MLA Talashila Raghuram), జక్కంపూడి రాజా(Jakkampudi Raja) సైతం వెళ్లారు. మిథున్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. జగన్ సన్నిహితులను మంత్రి నారా లోకేశ్ టార్గెట్ చేశారని, కావాలనే వారందరిని జైలు పాలు చేస్తున్నారని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు.

Next Story