- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దాపురం అభ్యర్ది చినరాజప్పకు తప్పిన పెను ప్రమాదం..
పెద్దాపురం టీడీపీ అభ్యర్ధి, మాజీ హోం మంత్రి చినరాజప్ప కారు ప్రమాదానికి గురైంది

X
దిశ, డైనమిక్ బ్యూరో: పెద్దాపురం టీడీపీ అభ్యర్ధి, మాజీ హోం మంత్రి చినరాజప్ప కారు ప్రమాదానికి గురైంది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీల తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పెద్దాపురం సీటు టీడీపీ నుంచి చిన రాజప్పకు కేటాయించారు. ఈ సందర్భంగా జే తిమ్మాపురంలో తన అభిమానులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. అదే సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి అకస్మాత్తుగా కారుకు అడ్డు రావడంతో అతడిని తప్పించబోయి, అదుపు తప్పిన కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చినరాజప్ప సహా ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు స్వల్పంగా దెబ్బతిన్నది. ఆయన తిరిగి అదే కారులో వెళ్లిపోయారు.
Next Story






