- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరు లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ నిడిగుంట అరుణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ నిడిగుంట అరుణ (Aruna)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది నెలలుగా జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారిన ఆమెపై పోలీసులు పీడీ యాక్ట్ (Prevevtive Detention Act) నమోదు చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్ కలెక్టర్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
సమాజ శాంతికి భంగం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భౌతిక దాడులకు పాల్పడటం, నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా డబ్బు వసూలు చేయడం వంటి తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో అరుణను పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నివేదిక ఇచ్చారు. ఈ పీడీ యాక్ట్ నమోదుతో ఆమె ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు.






