- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాశక్తి పథకంపై ఒక చేతులెత్తేసినట్లే: ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్
మహాశక్తి పథకంపై కూటమి ప్రభుత్వం ఇక చేతులెత్తేసినట్లేనని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: మహాశక్తి పథకం(Mahashakti scheme)పై కూటమి ప్రభుత్వం ఇక చేతులెత్తేసినట్లేనని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC Chief YS Sharmila) అన్నారు. మహాశక్తి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. మహాశక్తి పథకాన్ని పథకాన్ని బంగాళాఖాతంలో కలిపినట్లేనని చెప్పారు. సూపర్ సిక్స్(Super Six)లో ఒక సిక్స్‌కి పంగనామాలు పెట్టినట్లేనని ఎద్దేవా చేశారు. మంచి ప్రభుత్వం అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వానికి ఇది నిజంగా సిగ్గుచేటని విమర్శించారు. మంచి ముసుగులో మహిళలను ముంచుతున్నారని, ఆ మధ్య సీఎం చంద్రబాబు గారేమో పథకాన్ని P4లో కలిపామని,అమలు చేసేశామని అబద్ధాలు చెప్తారని విమర్శించారు సూపర్ సిక్స్ ఎక్కడ అని అడిగే వాళ్ళ నాలుక మందం అంటారని, ఇవాళ చంద్రబాబు, మంత్రిగారేమో మహాశక్తి కోసం ఆంధ్రా(Andhra)ను అమ్మాలని అంటారని, అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాద అంటారని వైఎస్ షర్మిల విమర్శించారు.
‘‘కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తున్నాం. మహిళలకు నెలకు 15 వందలు ఇస్తామని హామీ ఇచ్చే ముందు తెలియదా ఆంధ్రాను అమ్మాలని ? సూపర్ సిక్స్ లో హామీల్లో పెట్టి మహిళల ఓట్లు దండుకొనే ముందు తెలియదా ఈ పథకం ఆర్థిక భారం అని ?. ఆర్థిక అంచనా లేకుండానే గుడ్డిగా వేల కోట్ల హామీ ఇచ్చారా ?. ఆడబిడ్డ కష్టాలు నేరుగా చూశామని మోసం చేయడమేనా మీరిచ్చే మహిళా సంక్షేమం?. సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.’’ అని షర్మిల డిమాండ్ చేశారు. షర్మిల ట్వీట్...






