- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశ్నార్థకంగా ఆర్కిటెక్చర్ విద్యార్థుల భవిష్యత్: మాజీ సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర ఆగ్రహం
గత ప్రభుత్వం చేసిన తప్పుతో ఆర్కిటెక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం చేసిన తప్పుతో ఆర్కిటెక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC Chief YS Sharmila) అన్నారు. సీవోఏ అనుమతి లేకుండా గత ప్రభుత్వం కోర్సులు ప్రారంభించిందని, అవి పూర్తి అయి నెలలు గడుస్తున్నా యాజమాన్యం ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని వైఎస్సార్ కడప ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థుల నిరసన దీక్షకు ఆమె మద్దతు తెలిపారు. రూ. 15 లక్షలు ఖర్చు చేసి మరీ ఆయా కోర్సు(Course)లో విద్యార్థులు చదవారని, వారి ఐదేళ్ల కష్టానికి వాలిడేటెడ్ సర్టిఫికేట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉందని వైఎస్ షర్మిల ఆరోపించారు. 2020లో వర్సిటీ పెట్టినప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి ఇవ్వలేదన్నారు. జగన్ ప్రభుత్వం ఎన్‌రోల్ చేయకుండా విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఆర్కిటెక్చర్ వర్సిటీకి అనుమతి లేదని తెలిసి కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. అనుమతి లేకుండా వర్సిటీ కొనసాగుతోందని తెలియదా అని నిలిదీశారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పును చంద్రబాబు ప్రభుత్వం సరిచేయాలని షర్మిల డిమాండ్ చేశారు.






