- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సంగతి గుర్తుపెట్టుకోండి: చంద్రబాబుకు షర్మిల కీలక సూచన
విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజలపై ప్రభుత్వం విధిస్తున్నది సర్దుపోటు అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: విద్యుత్(Vidyut) సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తున్నది సర్దుపోటు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) అన్నారు. ట్రూ అప్ చార్జీల వసూళ్లపై ఆమె స్పందించారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూనే జనాలకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పెడుతున్నవి షాకుల మీద షాకులు అని ఆమె ఎద్దేవా అన్నారు. అవి ట్రూ అప్ ఛార్జీలు కాదు..సామాన్యుడిని నడ్డి విరిచే ఛార్జీలు అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేసే ఛార్జీలు అని చెప్పారు. జనం నెత్తిన పెడుతున్నది గుదిబండ అని విమర్శించారు. ఇప్పటికే రూ.17 వేల కోట్ల భారాన్ని మోపారని, ఇది చాలదన్నట్లు మరో రూ.12 వేల కోట్ల మేర అధిక భారాన్ని మోపాలని చూడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశార. ట్రూ అప్ చార్జీల వసూళ్లపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజా అభిప్రాయం సేకరిస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. కరెంటు ఛార్జీల వీర బాదుడులో వైఎస్ జగన్(Ys Jagan)కి చంద్రబాబు వారసుడు అని షర్మిల విమర్శించారు.
‘‘కూటమిని గెలిపిస్తే ఒక్క రూపాయి పెంపు ఉండదన్నారు. అవసరమైతే ఛార్జీల్లో 30 శాతం తగ్గిస్తామని గొప్పలు చెప్పారు. తీరా పవర్ దక్కాక 14 నెలల్లోనే రూ.30 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని జనం నెత్తిన పెడుతున్నారు. హామీలను మరిచి ఓటేసిన పాపానికి పేదోడి ఇళ్లను గుళ్ళ చేస్తున్నారు. ట్రూ అప్ తప్పు మీది కాదు సరే.. అలాగని గత వైసీపీ తప్పిదాలను ప్రజల నెత్తిన రుద్దుతారా?. YCP పెట్టిన భారాన్ని జనాల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తారా?. గత పాలకుల తప్పులను సరిదిద్దడం అంటే జనాలను బాదడమా ?. ఏనాడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనపు ఛార్జీలు వేయడం ఏంటి?. ట్రూ అప్ పేరుతో ఎన్నాళ్లు ఈ దోపిడి ? విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు చంద్రబాబు చేసింది నమ్మక ద్రోహం.’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
‘‘రూ.12 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని ప్రజలపై పడకుండా చూడండి. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. వెంటనే చంద్రబాబు గారు APERCకి లేఖ రాయాలి. గతంలో విధించిన రూ.17 వేల కోట్ల భారాన్ని సైతం వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వం తప్పు చేసినా.. ప్రజా కోర్టులో పడే శిక్ష మీకే అన్న సంగతి చంద్రబాబు గారు గుర్తు పెట్టుకోవాలి.’’ అని వైఎస్ షర్మల సూచించారు.






