అది సుఖీభవ కాదు.. దుఃఖీభవ: ప్రభుత్వ పథకంపై వైఎస్ షర్మిల సెటైర్లు

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్న వేళ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలసంచలన విమర్శలు చేశారు....

అది సుఖీభవ కాదు.. దుఃఖీభవ: ప్రభుత్వ పథకంపై వైఎస్ షర్మిల సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava) పథకం అమలు చేయనున్న వేళ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC Chief YS Sharmila) సంచలన విమర్శలు చేశారు. ప్రభుత్వం రైతులకు ఇస్తున్నది అన్నదాత సుఖీభవ కాదని, దుఃఖీభవ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే కేవలం 47 లక్షల మందినే అన్నదాత సుఖీభవకు ఎంపిక చేశారని వ్యాఖ్యానించారు. వడపోతల పేరుతో 30 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20వేలు ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారని, గెలిచిన తర్వాత కేంద్రం ఇచ్చే రూ. 6వేలతో ముడిపెట్టి నాలుక మడతేశారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చే రూ.6వేలు పక్కన పెడితే రాష్ట్ర నిధుల నుంచి మీరిచ్చేది కేవలం రైతుకి రూ.14వేలే అని వ్యాఖ్యానించారు. కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధమని షర్మిల ప్రశ్నించారు.

‘‘కేంద్రం నేరుగా రైతుల అకౌంట్‌లో వేస్తున్నప్పుడు మీరెలా ఇచ్చినట్లు చెప్పుకుంటారు అన్నారు?. రెండు కలిసే సమస్యే లేదన్నారు. ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు మీరెందుకు కేంద్రం నిధులతో లింక్ పెట్టారు?. మీరిస్తామని చెప్పిన రూ.20 వేలకు కేంద్రం వాటాను ఎందుకు జోడించారు?. హామీలు ఇచ్చేముందు కేంద్రం వాటాతో కలిపి అని ఎందుకు చెప్పలేదు?. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకం(PM Kisan Scheme) దేశంలో ఉన్న రైతులందరికి తప్పా కేవలం ఏపీకే కాదు కదా?. ప్రభుత్వం నేరుగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.20వేలు ఇవ్వాలి.’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Next Story