- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: పవర్ ఎంత ఎక్కువుంటే ఇంజన్ అంత ముందు కెళుతుంది.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇది డబుల్ఇంజిన్సర్కార్ .. గోదావరి జిల్లాల్లో యూత్ నడిపే బైకుల సౌండ్ నాకు తెలుసు.

పర్యాటక రంగంతో ఉపాధి అవకావాలు..
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల ప్రారంభం
హాజరైన కేంద్ర మంత్రి షెకావత్
దిశ, డైనమిక్ బ్యూరో : ఇది డబుల్ఇంజిన్సర్కార్(Double engine Sarkar).. గోదావరి జిల్లాల్లో యూత్ నడిపే బైకుల సౌండ్ నాకు తెలుసు.. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకు వెళ్తుంది.. కేంద్రంలో కూడా శక్తిమంతమైన ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి... అని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్అన్నారు. ప్రతిష్టాత్మక అఖండ గోదావరి (Godavari)ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం సైన్స్కేంద్రాన్ని ప్రారంభించారు. ఫారెస్ట్ అకాడమీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి అంటే గుర్తుకు వచ్చేది గోవావరి తీరం అన్నారు. ఆది కవి నన్నయతో పాటు ఎంతో మంది కళాకారులు జన్మనిచ్చిన నేల ఇదని తెలిపారు. తీరం వెంబటి నాగరికత, భాష అన్నీ పెరుగుతాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇదన్నారు. పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు. హేవ్ లాక్ బ్రిడ్జి చాలా పురాతనమైనది, వాడకుండా వదిలేయబడింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచించి పర్యాటకం కింద మంచి ప్రాజెక్ట్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని అభాప్రాయపడ్డారు. పుష్కరాలన నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. స్టీల్‌ప్లాంటు (Steel plant) ప్రైవేటీకరణ కాకుండా ఆపామంటే దానికి కేంద్ర మంత్రి షెకావత్కారణం అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్షెకావత్మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనకు చంద్రబాబు , పవన్కల్యాణ్కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ప్రపంచంలోనే పర్యాటకుల శాతం వేగంగా పెరిగింది భారత్‌లోనే అని తెలిపారు. పర్యాటక రంగానికి ఏపీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. పర్యాటకంగా కాకుండా ఆధ్యాత్మికంగానూ అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంపీ పురందేశ్వరి (Purandeswari)మాట్లాడుతూ డబుల్ ఇంజిన్సర్కారు ఉంటే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆనాడు చెప్పామన్నారు. ప్రజలు మాపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారని తెలిపారు. వికసిత్భారత్లో వికసిత్ఆంధ్రప్రదేశ్ఒక భాగమన్నారు. అమరావతి, పోలవరం ఇలా అన్నిటిలో కేంద్ర సహకారం అందిస్తుందని తెలిపారు. అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసుకుంటున్నామని తెలిపారు. చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధి చేసేందుకు కేంద్రం సాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్ , నిమ్మల రామానాయుడు, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ , బత్తుల బలరామకృష్ణ , చిర్రి బాలరాజు , మద్దిపాటి వెంకటరాజు , శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు పాల్గొన్నారు.






