ఢిల్లీ నుంచి విశాఖకు పవన్.. నేరుగా అక్కడికి వెళ్లనున్న జనసేన చీఫ్

by Sathputhe Rajesh |   (  Updated:2024-06-10 08:41:36  IST  )

ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్లిన జనసేన చీఫ్ పవన్ కల్యా్ణ్ విశాఖకు కాసేపటి క్రితం చేరుకున్నారు.

ఢిల్లీ నుంచి విశాఖకు పవన్.. నేరుగా అక్కడికి వెళ్లనున్న జనసేన చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్లిన జనసేన చీఫ్ పవన్ కల్యా్ణ్ విశాఖకు కాసేపటి క్రితం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పవన్, సీఎం రమేష్ తదితరులు విశాఖ చేరుకోగా.. పవన్ నేరుగా పిఠాపురం వెళ్లనున్నారు. అక్కడ పార్టీ నేతలతో పవన్ కీలక సమావేశంలో పాల్గొంటారు. టీడీపీ-జనసేనల మధ్య నెలకొన్న అసమ్మతిపై పవన్ సమాశంలో ఇరు పార్టీ నేతలతో మాట్లాడనున్నారు. అయితే పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య వార్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ భేటీ తర్వాత రెండు పార్టీల శ్రేణులు ఎలా ముందుకెళ్తాయి అనేది ఆసక్తిగా మారింది.

Next Story