బాలకృష్ణతో పవన్ అన్‌స్టాపబుల్ షో.. రోజా ఏమన్నారంటే?

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-29 05:05:13  IST  )

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్ పాల్గొనడంపై ఏపీ వైసీపీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణతో పవన్ అన్‌స్టాపబుల్ షో.. రోజా ఏమన్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్ పాల్గొనడంపై ఏపీ వైసీపీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ షోకు వెళ్లని పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షోకు వెళ్లడం వింతగా ఉందన్నారు. జనసేన నాయకులు పార్టీ అధినేత తీరును గమనించాలన్నారు. ఆ పార్టీ నాయకులపై వైసీపీకి సానుభూతి ఉందన్నారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబును అనుసరిస్తున్నరని ఆరోపించారు. ఇక ఏపీలో నారాలోకేష్ పాదయాత్రపై మాట్లాడుతూ.. అది యువగళం కాదని నారా గళమని విమర్శించారు. కాగా ఇటీవల పవన్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Next Story