పవన్‌ని సీఎం గా చూడాలి.. డిప్యూటీ సీఎం వివాదం వేళ జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

ఏపీలో డిప్యూటీ సీఎంల వివాదం కొనసాగుతున్న వేళ జనసేన నేత కిరణ్ రాయల్(Janasena Leader Kiran Royal) సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ని సీఎం గా చూడాలి.. డిప్యూటీ సీఎం వివాదం వేళ జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో డిప్యూటీ సీఎంల వివాదం కొనసాగుతున్న వేళ జనసేన నేత కిరణ్ రాయల్(Janasena Leader Kiran Royal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా టీడీపీ నాయకులు(TDP Leaders), కేడర్ అంతా నారా లోకేష్(Nara Lokesh) ని డిప్యూటీ సీఎం(Deputy CM) చేయాలని కోరుకుంటున్నారని, ఇది శుభపరిణామమేనని, రాజకీయాల్లో ఉన్నప్పుడు తమ నాయకుడిని ఉన్నత హోదాలో చూడాలని ఆశించడంలో తప్పు లేదన్నారు. అలాగే మాకు కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని ముఖ్యమంత్రి(Chief Minister)గా చూడాలని కోరిక ఉందన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉన్నామని, మా నాయకుడిని సీఎం హోదాలో చూడాలని జనసేన నాయకులు(Janasena Leaders), పవన్ కళ్యాణ్ అభిమానులకు కోరిక ఉందన్నారు.

ఎవరి కోరికలు వారికి ఉంటాయని, కానీ కూటమిలో ఉన్నప్పుడు మన మాటలు వైసీపీ(YCP) వారికి అవకాశంగా మారకూడదని స్పష్టం చేశారు. మెగా బ్రదర్స్(Mega Brothers) అంటే ముగ్గురు కాదు చంద్రబాబు(Chandrababu naidu)తో కలిపి నలుగురని, ఆ విధంగానే కూటమితో విజయం సాధించి ముందుకు పోతున్నామని తెలిపారు. ఇలాంటి సమయాల్లో మనల్ని చెడగొట్టాలని వైసీపీలో ఒక బ్యాచ్ ఎదురు చూస్తారని, వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందంతోనే ముందుకు వెళితే మంచిదని, మనసులో మాటలను బయటపెట్టి వైసీపీ పేటీఎం బ్యాచ్ కు సోషల్ మొరిగేందుకు, రాష్ట్ర రాజకీయాల్లో అలజడులు సృష్టించేందుకు అవకాశం ఇవ్వద్దని సూచించారు. కూటమిని చీల్చాలని చాలా మంది పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, కూటమిని చీల్చడం ఎవరి వల్ల కాదని, పది సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ లక్ష్యమని కిరణ్ రాయల్ తెలియజేశారు.

Next Story