- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan : అనకాపల్లి ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి
ఏపీ(AP)లోని అనకాపల్లి బాణాసంచా పేలుడు(Anakapally Incident) ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని అనకాపల్లి బాణాసంచా పేలుడు(Anakapally Incident) ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా(Anakapally) కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రం(Fireworks manufacturing Unit)లో ఆదివారం భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8 కి చేరింది. ప్రమాద ఘటనలోనే ఐదుగురు చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. కాగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు విశాఖ కేజీహెచ్ వైద్యులు తెలిపారు.
కాగా ఈ భారీ అగ్నిప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడి.. ప్రమాద వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై పవన్ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. అయితే ప్రమాద ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పేలుడు జరిగిన ఫ్యాక్టరీ ప్రాంతంలో భీతావహ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
Also Read..
అనకాపల్లి జిల్లాలో భారీ ప్రమాదం.. బాధితులకు రూ.15 లక్షల పరిహారం






