బీజేపీ వాళ్లు కనిపెట్టలేనిది పవన్ చెప్పాడు.. సీపీఐ నేత రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు

by Ramesh Goud |

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై టీడీపీ వైఖరి ఏంటో అర్థం కావడం లేదని, ముస్లింలకు ద్రోహం చేసింది ఎవరో వారే చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు.

బీజేపీ వాళ్లు కనిపెట్టలేనిది పవన్ చెప్పాడు.. సీపీఐ నేత రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు
X

దిశ, వెబ్ డెస్క్: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు (Waqf Board Amendment Bill)పై టీడీపీ వైఖరి (TDP Stand) ఏంటో అర్థం కావడం లేదని, ముస్లింలకు ద్రోహం చేసింది ఎవరో వారే చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ (CPI Leader Ramakrishna) ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వక్ఫ్ సవరణ బిల్లు పట్ల టీడీపీ నేతలు (TDP Leaders) చేస్తున్న వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై బీజేపీ స్టాండ్ (BJP Stand) ఏంటో పురందేశ్వరి (Purandeshwari) స్పష్టంగా చెప్పారని, కానీ దీనిపై టీడీపీ వైఖరి ఎంటో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లు పై టీడీపీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్ఆర్సీపీ (YSRCP) లోక్ సభలో వ్యతిరేకంగా ఓటు వేసి, రాజ్యసభలో మద్దతు ఇచ్చిందని, ముస్లింలకు ద్రోహం చేసిందని అంటున్నారు.. మరి రెండు సభలలో మద్దతు ఇచ్చిన టీడీపీ ముస్టింలకు ద్రోహం చేసినట్టు కాదా? అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు ఒక సభలోనే మద్దతు ఇచ్చారని, మరి రెండు సభలలో మద్దుతు ఇచ్చిన టీడీపీ వైఖరి ఏంటని నిలదీశారు.

ఇక వక్ఫ్ బిల్లుపై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి చెప్పనక్కర్లేదని, ఆయన పేద ముస్లింల అభివృద్ధి కోసమే ఈ బిల్లు తెచ్చారని మాట్లాడుతున్నారని అన్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ను ఏం అనడానికి లేదని, ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చిన వారిని అభినందించాల్సిన అవసరం ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ బిల్లు పేద ముస్లింల కోసం అని బీజేపీ వాళ్లు కూడా కనిపెట్టలేకపోయారని, కానీ పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతున్నాడని సీపీఐ నేత అన్నారు.

Next Story