Pawan Kalyan : ఉగ్రదాడి మృతులకు పవన్ కన్నీటి నివాళి

by Muthe.Rajitha |

జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే.

Pawan Kalyan : ఉగ్రదాడి మృతులకు పవన్ కన్నీటి నివాళి
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతి చెందిన వారిలో ఏపీ(AP) వాసులు కూడా ఉన్నారు. వైజాగ్ కు చెందిన చంద్రమౌళి(Chandramouli), నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధు సూదన్ రావు(Madhu Sudan Rao)లు ఉగ్రవాదుల కాల్పుల్లో కన్నుమూశారు. కాగా గురువారం మధు సూదన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మృతునికి కన్నీటి నివాళులు అర్పించారు.

మృతుని కుటుంబాన్ని, పిల్లలను దగ్గరికి తీసుకొని ఓదార్చిన పవన్.. ఈ ఘటనను దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరుతున్నానని తెలిపారు. చిన్నపిల్లలు, కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఉగ్రవాదులు అరాచకానికి పాల్పడ్డారని ఆవేదన చెందారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రభుత్వం తరపున రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Next Story