- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడిని రక్షించిన సిబ్బందికి సన్మానం
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(deputy CM Pawan kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark shanker) చదువుతున్న పాఠశాల(School)లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(deputy CM Pawan kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark shanker) చదువుతున్న పాఠశాల(School)లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ ఇబ్బంది ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో మార్క్ ఆరోగ్యం మెరుగుపడిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్‌ను కాపాడిన రెస్క్యూ సిబ్బందికి ఆ దేశ ప్రభుత్వం(Government) సన్మానం చేసినట్లు సమాచారం. పాఠశాల భవనంలో జరిగిన ప్రమాదంలో 22 మంది విద్యార్థులను సిబ్బంది రక్షించారు.
అగ్ని ప్రమాద సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి, చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థులను కాపాడినందుకు సత్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), పవన్ కళ్యాణ్ పేర్కొన్న సంగతి విదితమే.






