తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి

by Jakkula.Mamatha |

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాదిగా భక్తులు దర్శించుకుంటారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాదిగా భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా(Anna Lezhinova) ఇవాళ(సోమవారం) ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదెలకి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అయితే.. ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. మూడు రోజుల పాటు సింగపూర్‌లో అతనికి చికిత్స అందించారు. ఈ క్రమంలో నిన్న(ఆదివారం) ఉదయం పవన్‌ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా(Anna Lezhinova)లు మార్క్ శంకర్‌ని హైదరాబాద్(Hyderabad) తీసుకువచ్చారు. తన కుమారుడు కోలుకోవడంతో మొక్కులు చెల్లించుకోవడానికి అన్నాలెజినోవా నిన్న(ఆదివారం) తిరుమలకు వెళ్లిన విషయం తెలిసిందే.

Next Story