‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్’.. గ్రామస్తుల వినూత్న కృతజ్ఞతలు(ఫొటో వైరల్)

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-27 09:21:49  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌కు గ్రామస్తులు వినూత్న రితీలో కృతజ్ఞతలు తెలిపారు.

‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్’.. గ్రామస్తుల వినూత్న కృతజ్ఞతలు(ఫొటో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌కు గ్రామస్తులు వినూత్న రితీలో కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలానికి చెందిన ఓ చిత్రకారుడు, కొణిదెల గ్రామస్థులు కలిసి అద్భుతమైన ఫొటోను రూపొందించారు.

అయితే, కొణిదెల గ్రామ అభివృద్ధి కోసం ప‌వ‌న్‌ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన సొంత నిధుల నుంచి రూ. 50 లక్షలు కేటాయించారు. ఈ తరుణంలో ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిన్న(గురువారం) భూమి పూజ కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆనందంతో గ్రామస్థుల తరఫున ఓ కళాకారుడు తన కళానైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ‘‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొణిదెల లీడర్‌కి హృదయ పూర్వక కృతజ్ఞతలు’’ అనే వాక్యంలోని అక్షరాలతో పవన్ కల్యాణ్ ముఖచిత్రాన్ని అద్భుతంగా గీశాడు. తమ గ్రామ అభివృద్ధికి సాయం చేసిన నాయకుడికి ఈ అక్షర చిత్రం ద్వారా తమ ప్రేమను, గౌరవాన్ని తెలియజేశారు. ఈ వినూత్న ఆలోచన అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రజెంట్ ఈ ఫొటో సామాజిక మాధ్యమ(Social Media)ల్లో వైరల్‌గా మారింది.

Next Story