- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: ఆ పదం వింటే ముందు గుర్తొచ్చేది టీడీపీనే
తెలుగు దేశం పార్టీ(TDP) మహానాడు(Mahanadu) అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ(TDP) మహానాడు(Mahanadu) అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమైంది. కడప వేదికగా నిర్వహించిన ఈ మహానాడును అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి ప్రారంభించారు. వేదిక మీద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలు కీలక తీర్మానాలు చేశారు. తాజాగా మహానాడుపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ట్వీట్ పెట్టారు.
‘మహానాడు.. ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై.. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్(Nara Lokesh)కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
చంద్రబాబు(Chandrababu) నాయకత్వములో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులకు శుభాభినందనలు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువగళం, స్త్రీశక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.






