AP Deputy CM:‘చట్ట ప్రకారం చర్యలుంటాయ్’.. వారికి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

by Jakkula.Mamatha |

నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి.

AP Deputy CM:‘చట్ట ప్రకారం చర్యలుంటాయ్’.. వారికి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఈ తరుణంలో మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) తీవ్రంగా ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళ ఎమ్మెల్యే పై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని పవన్ కల్యాణ్ సూచించారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలుంటాయి. మహిళ సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని అన్నారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తారా? అని నిలదీశారు. ఈ క్రమంలో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

Next Story