- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court: పవన్ కల్యాణ్ కుమారుడికి ఢిల్లీ హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన పేరుతో సోషల్ మీడియాలో చలామణీ అవుతున్న నకిలీ అకౌంట్లు, ఏఐ (AI) వీడియోలపై అకీరా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి తన వ్యక్తిత్వాన్ని, గోప్యత హక్కులను (Personality and Privacy Rights) కొందరు ఉల్లంఘిస్తున్నారని అకీరా నందన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
సోషల్ మీడియా దిగ్గజాలకు నోటీసులు
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అకీరా నందన్ పేరుతో ఉన్న నకిలీ ఖాతాలను, ఏఐ వీడియోను తక్షణమే తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా సదరు నకిలీ అకౌంట్లను నిర్వహిస్తున్న వారి IP అడ్రస్‌లను బహిర్గతం చేయాలని ఆదేశించింది.
'AI లవ్ స్టోరీ' పేరుతో సినిమా!
కాగా, తన పేరు, ఫొటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని వాడుకుని 'AI లవ్ స్టోరీ' పేరుతో ఓ పూర్తిస్థాయి సినిమాను రూపొందించారని, దాన్ని యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారని అకీరా తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ డీప్‌ఫేక్ సినిమా వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని అతను కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ఏఐ వీడియో రూపొందించిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే గుర్తించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజా కోర్టు ఆదేశాలతో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడినట్లయింది. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం అకీరాకు పెద్ద ఊరటనిచ్చింది.






