AP Deputy CM:‘రియల్ హీరో ఆయనే’.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-31 12:14:11  IST  )

ఢిల్లీ(Delhi)లో జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

AP Deputy CM:‘రియల్ హీరో ఆయనే’.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi)లో జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ రోజు(ఆదివారం) భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీయే నేతల సమావేశానికి ఎన్డీయే కూటమిలోని రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) మినహా కూటమిలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు(Chief Ministers), డిప్యూటీ సీఎం(Deputy CM)లు హాజరైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రధాని మోడీతో కలిసి ఇవాళ లంచ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ‘‘భారత దేశ నిజమైన హీరో, ప్రియమైన నాయకుడు పీఎం మోడీతో కలిసి భోజనం చేశాం. దేశం పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం’’ అని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story