‘ఆ ఘటనపై లోతుగా విచారణ చేయాలి’.. అధికారులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-14 09:28:13  IST  )

శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక మందిరంలో అగ్ని ప్రమాదం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan kalyan) స్పందించారు

‘ఆ ఘటనపై లోతుగా విచారణ చేయాలి’.. అధికారులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక మందిరంలో అగ్ని ప్రమాదం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan kalyan) స్పందించారు. ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం అన్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపంలోని కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు.

ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలి అని తెలిపారు. కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పడింది. కూర్మ గ్రామ వాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్ళలో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు.

Breaking:ఆధ్మాత్మిక మందిరానికి నిప్పు.. భయంతో పరుగులు తీసిన భక్తులు

Next Story