- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM: కర్ణాటక రోడ్డు ప్రమాదం పై పవన్ కళ్యాణ్ స్పందన
కర్ణాటక(Karnataka)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం (Mantralayam) వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు.

దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక(Karnataka)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం (Mantralayam) వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. రఘునందన తీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందించారు. కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు, ఆ వాహన డ్రైవర్ మృతి చెందడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. విద్యార్థుల మృతి తీవ్ర ఆవేదన కలిగించిందని తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు హంపిలో ఆరాధనోత్సవానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారని తెలిసిందని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు.






