- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తణుకులో పవన్ కల్యాణ్ ‘OG’ హీరోయిన్ సందడి
by Gantepaka Srikanth |
తణుకులో పవన్ కల్యాణ్ ‘OG’ హీరోయిన్ సందడి చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని స్వయంభూ కపర్దేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటి ప్రియాంక మోహన్(Priyanka Mohan) దర్శించుకున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు డా. భమిడి అఖిల్, ఘనాపాటి భమిడి సీతారామ కృష్ణావధానులు నివాసానికి విచ్చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు కాకినాడ పట్టణంలో యాంకర్ అనసూయతో కలిసి ఓ షాపింగ్ మాల్‌ను ప్రియాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రియాంక మోహన్, అనసూయను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. కాకినాడకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాకినాడ కాజా, సీఫుడ్ అంటే ఎంతో ఇష్టమన్నారు. ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆయన మ్యానరిజంతో అభిమానులను ఊర్రూతలూగించారని అన్నారు. ఫొటోస్
Next Story






