DCM:ఆ గ్రామంలో ఇళ్లలోకి నీరు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

by Jakkula.Mamatha |

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి

DCM:ఆ గ్రామంలో ఇళ్లలోకి నీరు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ తరుణంలో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మాయాపట్నం గ్రామాన్ని రాకాసి అలలు చుట్టుముట్టాయి. దీంతో దాదాపు గ్రామంలోని 70 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. తీరానికి సమీపంలో ఉన్న గృహాలు నేలకూలగా.. మరో 30 ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలసిపోనున్నాయి.

ఈ క్రమంలో మాయాపట్నంలో తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందించారు. ఈ తరుణంలో వెంటనే పవన్ కళ్యాణ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు వెంటనే అధికార యంత్రంగం రంగంలోకి దిగాయి. పారిశుధ్య సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. బాధితులకు పాలు, ఆహార, మంచి నీరు అందిస్తున్నారు. తమ ఎమ్మెల్యే చొరవ పై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story