Pawan Kalyan: వారి పట్ల కఠినంగా ఉండండి.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

ప్రజా సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. శనివారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

Pawan Kalyan: వారి పట్ల కఠినంగా ఉండండి.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. శనివారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం సదరు అర్జీలను సంబంధిత అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీలో మహిళలపై యువకుల వేధింపులపై స్థానిక ఎస్పీ సుబ్బారాయుడుతో పవన్ కల్యాణ్ ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలను వేధించిన వారి పట్ల కఠినంగా ఉండాలని సూచించారు. పవన్ కల్యాణ్ ఆదేశానికి స్పందించిన ఎస్పీ.. వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story