- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Konaseema: పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలో ఉన్న ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ ఘటన కారణంగా తలెత్తిన బ్లో అవుట్ ప్రభావం గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు.

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలో ఉన్న ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ ఘటన కారణంగా తలెత్తిన బ్లో అవుట్ ప్రభావం గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్లో అవుట్ చోటు చేసుకున్న ప్రాంతానికి కిలో మీటరు పరిధిలో ఉన్న పాఠశాలలను ఖాళీ చేయించామని తెలుపుతూ ఇరుసుమండ ప్రాంతంలో చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంసిద్ధంగా ఉన్నాయనీ, సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి తరలిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో పాటు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌తోనూ పవన్ కల్యాణ్ ఫోన్‌లో మాట్లాడారు. బ్లో అవుట్ విషయమై పరిసర ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, సామాజిక మాధ్యమాల్లో వదంతులు, ఆందోళన కలిగించే అంశాలు ప్రచారం కాకుండా చూడాలని సూచించారు. పరిసరాల్లో ఉండే కొబ్బరి తోటలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. సహాయక శిబిరాల్లో ఉండేవారికి అవసరమైన ఔషధాలతోపాటు, శీతాకాలమైనందున దుప్పట్లు కూడా ఇవ్వాలని సూచించారు.






