అధికారులను టార్గెట్ చేయొద్దు.. జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

by Ramesh Naini |

జనసేన శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. పార్టీ బలోపేతంపై 3 గంటల పాటు చర్చ సాగింది.

అధికారులను టార్గెట్ చేయొద్దు.. జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Jana Sena) జనసేన శాసనసభాపక్ష సమావేశం (Jana Sena Legislative Party meeting) ముగిసింది. పార్టీ బలోపేతంపై 3 గంటల పాటు చర్చ సాగింది. శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో నేతలకు జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక ఆదేశాలు ఇచ్చారు. కూటమి బలోపేతంతో పాటు ఐక్యంగా ఉండాలని పవన్‌ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలని వెల్లడించారు. వ్యక్తిగత విషయాలు, అధికారులను టార్గెట్ చేస్తూ మాట్లాడొద్దని, విమర్శలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల్లో నిత్యం ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని ఆదేశించారు. కార్యకర్తలకు, పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలో జిల్లాల పర్యటనకు వస్తాను.. నియోజకవర్గాల్లో పెండింగ్ హామీలు, ప్రధాన సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని పార్టీ నేతలకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Next Story