- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వగ్రామానికి ఉగ్రదాడి మృతుడి భౌతికకాయం.. పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
జమ్మూకాశ్మీర్(Jammu Kashmir)లోని పహల్గామ్‌లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిలో ఏపీ(Andhra Pradesh) వాసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్ రావు మృతి చెందాడు.

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్(Jammu Kashmir)లోని పహల్గామ్‌లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిలో అమాయకపు ప్రజలు బలయ్యారు. పహల్గం ఉగ్రదాడిలో ఏపీ(Andhra Pradesh) వాసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్ రావు మృతి చెందాడు. ఈ క్రమంలో ఆయన భౌతికకాయం ఇవాళ(గురువారం) ఉదయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతికకాయాన్ని నిన్న(బుధవారం) రాత్రి చెన్నై ఎయిర్ పోర్టుకు అక్కడి నుంచి ఈ రోజు ఉదయం కావలికి తీసుకొచ్చారు. ఆయన మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ తరుణంలో మధుసూదన్ అంత్యక్రియలు మధ్యాహ్నం నిర్వహించనున్నారు.
ఇక, ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కావలికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్ర దాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్ నివాళులర్పించనున్నారు. రిసెంట్‌గా ఉగ్రవాద దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. అమాయకపు ప్రజల పై ఉగ్రదాడి ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.






