AP Deputy CM:‘మాటా-మంతి’ కార్యక్రమం పై పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం ‘మాటా - మంతి’ పేరుతో ఇవాళ(గురువారం) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు

AP Deputy CM:‘మాటా-మంతి’ కార్యక్రమం పై పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం ‘మాటా - మంతి’ పేరుతో ఇవాళ(గురువారం) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, రావివలస పంచాయతీ ప్రజలందరిని టెక్కలి లోని సినిమా థియేటర్‌కు తీసుకువచ్చి వారితో క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా కీలక విషయాలు వెల్లడించారు.

ఈ రోజు నిర్వహించిన మాట-మంతి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో వెంటనే పరిష్కారం చేయగలిగే పనులను అప్పటికప్పుడు అధికారులతో చెప్పి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే కొన్ని సమయం పట్టే పనులకు సంబంధిత అధికారులకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులందరూ ఎంత ఉత్సాహంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను, తాము కోరుకుంటున్న అభివృద్ధి పనులను తెలియజేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ భారత్ మహోత్సవ్ లక్ష్యాన్ని.. చేరుకోవడంలో ఇది కీలక అడుగు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Next Story