సినిమాలు చేస్తే తప్పేంటి: పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిర్వహిస్తోన్న సేనతో సేనాని సమావేశం ప్రారంభం అయింది.

సినిమాలు చేస్తే తప్పేంటి: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిర్వహిస్తోన్న సేనతో సేనాని సమావేశం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జనం కోసం జనసేన నిరంతరం నిలబడుతుందని ప్రకటన చేశారు. నిస్వార్థ జనసైనికులు, వీరమహిళలే జనసేన బలం అని చెప్పారు. వచ్చే ఆవిర్భావ సభ నాటికి సంస్థాగత సైన్యం సిద్ధం కాబోతోందని అన్నారు. పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నాను అని స్పష్టం చేశారు. అయినా సినిమాలు చేస్తే తప్పేంటని విమర్శకులను ప్రశ్నించారు. అక్టోబర్‌ నుంచి పార్టీ కేడర్‌తో సమావేశమవుతా అని అన్నారు. తనకు కులం, మతంతో సంబంధం లేదని.. ప్రతీ అంశంపై మానవత్వంతో స్పందిస్తా అని అన్నారు. కాగా, అంతకుముందు వైసీపీ హయాంలో విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. భవన సముదాయంలో నిర్మాణాలు, సదుపాయాలను పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. సదుపాయాలకు గత ప్రభుత్వం వెచ్చించిన ఖర్చులను మంత్రులు ఆయనకు వివరించారు. భవనాల్లో అత్యాధునిక బెడ్‌రూమ్స్‌, బాత్‌రూమ్స్‌ చూసి పవన్‌ ఆశ్చర్యపోయారు. పాడైపోతున్న వాటికి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ఎన్జీటీలో కేసు నడుస్తోందని అధికారులు ఆయనకు వివరించారు.

Next Story