- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DCM:‘వైద్యుల సేవలు అమూల్యమైనవి’.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM pawan kalyan) నేడు(జులై 01) జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors Day) సందర్భంగా వైద్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM pawan kalyan) నేడు(జులై 01) జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors Day) సందర్భంగా వైద్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ‘‘తమ ముందుకు ఆరోగ్యపరమైన సమస్యలతో వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించి, స్వస్థత కలిగించేందుకు ప్రతి వైద్యుడు ఎంతో తపిస్తారు. క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగులకు సైతం పునర్జన్మ ఇచ్చేందుకు ఆసుపత్రి బల్లపై చిన్నపాటి యుద్ధమే చేస్తారు. వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. ప్రజలకు వైద్యులంటే ఎనలేని గౌరవమర్యాదలు ఉంటాయి. మన సంస్కృతి.. వైద్యుడిని మరో భగవంతుడిగా చూడటం నేర్పించింది. వైద్యులు వృత్తిపరంగా పట్టణాలు, నగరాలు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో ఉన్న- సామాజిక సేవా దృక్పథంతో మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.






