- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇక లాభం లేదు.. నేనే రంగంలోకి దిగుతా’.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
విశాఖ వేదికగా జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సేనతో సేనాని(Senato Senani) సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ వేదికగా జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సేనతో సేనాని(Senato Senani) సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. 150 మందితో మొదలైన జనసేన ప్రయాణం.. నేడు 12 లక్షల క్రియాశీల కార్యకర్తల స్థాయికి చేరిందని అన్నారు. కార్యకర్తలు మాట్లాడితే వినాలని అందరినీ ఇక్కడకు పిలిచామని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఉన్న విధానాలు, సిద్ధాంతాలు ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. జనసేన కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదని చెప్పారు. పేదల కోసం, యువత కోసం, రైతుల కోసం, మహిళల కోసం, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ అని అన్నారు. ఒకరోజు మన పార్టీ గురించి దేశమంతా మాట్లాడుకోవాలని పార్టీ పెట్టే ముందు కలలు కన్నాను.. నిజంగానే ఆ స్థాయికి మనం వెళ్లామని చెప్పారు. ఇక మీదట పార్టీని స్వయంగా తానే ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తానని అన్నారు. ఒక్క ఓటమితో చాలా మంది పిట్టల్లా మారిపోతారు.. అయినా మనం పారిపోలేదు. తట్టుకున్నాం.. నిలబడ్డాం.. ఓడిపోయినా కూడా పేదల కష్టాలు తీర్చే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడే గుణం నాకు ఉంది.. గుణంతోనే నిలబడ్డాం.. రికార్డు స్థాయి విజయం సాధించామని అన్నారు.






