AP Deputy CM:‘టీచర్లలోనూ హీరోలను చూసుకోండి’.. విద్యార్థులకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

by Jakkula.Mamatha |

ఏపీలో నేడు(శనివారం) దాదాపు 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్,టీచర్ సమావేశం(Parent & Teacher Meeting) ఏర్పాటు చేశారు.

AP Deputy CM:‘టీచర్లలోనూ హీరోలను చూసుకోండి’.. విద్యార్థులకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నేడు(శనివారం) దాదాపు 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్,టీచర్ సమావేశం(Parent & Teacher Meeting) ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కడపలోని కార్పొరేషన్ హైస్కూల్‌లో(Corporation High School) జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విద్యార్థులకు(Students) కీలక సూచనలు చేశారు. హీరోలను సినిమాల్లోనే కాకుండా టీచర్లలోనూ చూసుకోవాలని విద్యార్థులకు పవన్ కళ్యాణ్ సూచించారు. కడపలో నిర్వహించిన మెగా పేరెంట్&టీచర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కార్గిల్‌లో చనిపోయిన వారు, ఉపాధ్యాయులు నిజమైన హీరోలు అని, వారిని గౌరవించాలని అన్నారు.

అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. వారు ఎలా చదువుతున్నారు, పాఠ్యాంశాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీచర్లకు ఎక్కువ వేతనం వచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిల్లలు సోషల్ మీడియా(Social Media) తక్కువగా వాడేలా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్‌దేనని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్‌ను చదువు కోసం, అభివృద్ధి(Development) చెందడం కోసం వాడుతున్నారా లేక చెడు మార్గాల వైపు వెళ్తున్నారా అనేది గమనిస్తుండాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు.

Next Story