- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడను కుదిపేస్తున్న ‘కల్కి’ ఫీవర్..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ నేడు థియేటర్లలో విడుదలైంది.

దిశ,వెబ్‌డెస్క్:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘కల్కి’ 2898 ఏడీ నేడు థియేటర్లలో విడుదలైంది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారతీయ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ విష్ణువు పదవ అవతారంగా చెప్పబడే కల్కి అవతారాన్ని నాగ్ అశ్విన్ చూపించారు. 'కల్కి 2898 ఏడీ' సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటించగా..లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే కల్కి మూవీ రిలీజ్ సందర్భంగా విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం గారి తాలుకా అని రాసి ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, ‘కల్కి’ మూవీకి హిట్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
- Tags
- Kalki 2898 AD






