- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ నమ్మకం నాకు బలంగా ఉంది’.. ప్రధానికి వెల్‌కమ్ చెబుతూ పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) పున:నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అమరావతికి విచ్చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) పున:నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అమరావతికి విచ్చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు కూటమి నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానికి వెల్‌కమ్ చెబుతూ సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి పున: ప్రారంభానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అమరావతి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అమరావతి మహా నగరం వికసిత్ భారత్ 2047 నాటికి ప్రపంచ స్థాయి నగరంగా, భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు పునః ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోడీ పనులు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి పున: ప్రారంభానికి విచ్చేస్తున్న గౌ|| భారత ప్రధాని శ్రీ @narendramodi గారికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అమరావతి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న కేంద్ర… pic.twitter.com/wzmn5xOn4k
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 2, 2025






