DCM:‘తీసుకోవడమే కాదు.. ఇవ్వడానికి అలవాటు పడాలి’.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమం చేపట్టారు.

DCM:‘తీసుకోవడమే కాదు.. ఇవ్వడానికి అలవాటు పడాలి’.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమం చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా "మన ఊరు - మాటా మంతి" పేరుతో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఇవాళ(గురువారం) మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో మాట్లాడారు. అనంతరం పవన్ కల్యాణ్ విజయవాడ(Vijayawada) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని రక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు.. ఇవ్వడానికి అలవాటు పడాలని అన్నారు. ప్రకృతితో మమేకం కావాలనేది అత్యవసరమని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. చెట్లను తొలగించడం కాదు.. మొక్కలు నాటడం నేర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు.

సమస్త జీవరాశికి అవసరమైన స్వచ్ఛమైన గాలిని చెట్లు అందిస్తాయని.. వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. సహజంగా పెరిగిన మొక్కలు మనకు పనికి రాకపోవచ్చు. కానీ.. సహజంగా పెరిగిన మొక్కలు జీవ వైవిధ్యానికి అవసరమవుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మన పెరట్లో ఏం చేయగలం జీవ వైవిధ్యానికి ఎలా తోడ్పగలమో ఆలోచించాలని "వృక్షో రక్షతి రక్షితః"..చెట్లను కాపాడితే, అవి మనల్ని కాపాడతాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story