- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కాన్ చేయి.. చేరిపో..! ఏపీ, తెలంగాణ యువత కోసం పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమం
"సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహించనుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని పేర్కొన్నారు.
మార్పు కోరుకుంటే రాదు - మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుందని, ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫోటోలో పేర్కొన్న QR కోడ్ స్కాన్ చేసి, లేదా bit.ly/senathosenani లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఈ QR కోడ్ లేదా లింక్ ద్వారా ఆసక్తి కలిగిన ప్రతీ యువతీ, యువకుడు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ఆసక్తి చూపించిన వారితో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు వేదికల్లో కార్యక్రమం నిర్వహించబడుతుందని జనసేన పార్టీ (Janasena Party) తెలిపింది. నమోదు చేసుకున్న వారి నుంచి కొంత మందిని పార్టీ కార్యాలయం ఎంపిక చేసి వారిని త్వరలో ఫేస్-1 లో నిర్వహించబోయే కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన ఫైనల్ లిస్ట్ మెంబెర్స్‌ను వారికి ఆసక్తి కలిగిన అంశంపై పని చేసే అవకాశం జనసేన పార్టీ కల్పిస్తుంది. ఉత్తమ ప్రతిభ చూపించే వారికి నాయకత్వ శిక్షణ తరగతుల్లో, పార్టీ కీలక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. లింక్ ఇదే..






