పవన్ నాలుగో భార్య సీఎం జగన్ కాదు, నాదెండ్ల మనోహర్: మంత్రి అంబటి

by Malleboina Mahesh |

ఏపీలోని తాడేపెళ్లిగూడంలో టీడీపీ, జనసేన పార్టీలు కలసి మొదటి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు.

పవన్ నాలుగో భార్య సీఎం జగన్ కాదు, నాదెండ్ల మనోహర్: మంత్రి అంబటి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని తాడేపెళ్లిగూడంలో టీడీపీ, జనసేన పార్టీలు కలసి మొదటి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాన్ అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. వాటికి సమాధానం చెప్పలేక సీఎం జగన్ ప్రతి సారి తన పెళ్లిలా గురించి మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల కాలంలో తాను మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు వైసీపీ ప్రచారం ప్రారంభించిందని.. గుర్తు చేస్తూ.. నాలుగో నాలుగో భార్య.. సీఎం జగన్ అని కౌంటర్ అటాక్ ఇచ్చారు.

కాగా ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ నీకు నాలుగో భార్య జగన్ కాదని.. ఆయన నాలుగో పెళ్లం నాదెండ్ల మనోహర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేనాని పవన్ కల్యాణ్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి మొగుడు అంటూ.. మంత్రి అంబటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రజా సమస్యలపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాల్సిన నేతలు.. వ్యక్తిగత దూశనలు దిగడం వలన రాష్ట్రం పరువు పొతుందని పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Next Story