- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:రైతుల కోసం పవన్ కళ్యాణ్ కృషి.. రేపు రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులు
సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

దిశ,వెబ్‌డెస్క్: సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇవాళ(మంగళవారం) వెలగపూడి సచివాలయానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. మదపుటేనుగుల గుంపులు పంటలను నాశనం చేయడమే కాకుండా, పొలంలో ఉన్న వారి ప్రాణాలు తీస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల అలాంటి ఘటనలు ఎన్నో వెలుగుచూశాయని చెప్పారు. ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వీటికి పరిష్కారం గతంలోనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 6 కుంకీ ఏనుగుల కోసం ఒప్పందం చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM pawan Kalyan) తెలిపారు. దీనికి అనుగుణంగా రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) రేపు(మే 21) ఇవ్వనుంది.
కుంకీ ఏనుగుల ద్వారా మదపుటేనుగుల విధ్వంసం నుంచి బయటపడగలం అనే నమ్మకం ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి సహకారం కర్ణాటక ప్రభుత్వం అందించడం అభినందనీయం. దీంతో ఏనుగులతో వస్తున్న సమస్యలు చాలా వరకు తీరుతుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.






