Pawan Kalyan: రాఖీ అంటే కేవలం ఓ దారం కాదు

by Gantepaka Srikanth |

రాఖీ పండుగ(Rakhi Festival) సందర్భంగా తెలుగు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పారు.

Pawan Kalyan: రాఖీ అంటే కేవలం ఓ దారం కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: రాఖీ పండుగ(Rakhi Festival) సందర్భంగా తెలుగు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమి. ఈ సందర్భంగా సోదరీమణులకు మీ సోదరుడిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రాఖీ అంటే కేవలం ఓ దారం కాదు. అది మన అనుబంధాలకు ఓ భావోద్వేగాల సంకేతం. కూటమి ప్రభుత్వం మహిళలకు మేలు చేయడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే దీపం-2, తల్లికి వందనం పథకాలను విజయవంతంగా ఆచరణలోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని స్వాతంత్ర్య దినోత్సవం నుంచి అమలులోకి తీసుకురాబోతున్నాము. గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేకపోవడంతో గర్భిణీలను ఆసుపత్రులకు తీసుకువెళ్ళేందుకు డోలీలను ఆశ్రయిస్తున్నారనే వార్తలు కలచివేసేవి. అక్కడ డోలీలు లేకుండా ప్రయాణించేలా రోడ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తోంది. అడవి తల్లి బాట పేరుతో రహదారులు వేసే పనులు సాగుతున్నాయి. ఈ ప్రజా జీవితంలో వేసే అడుగుల్లో- ఆడపడుచులకు అండగా నిలిచి, వారి అభివృద్ధి గురించిన ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story