- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబిన్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బీజేపీలో యువజన విభాగంలో సేవలందించిన నితిన్ నబిన్ బీహార్ రాష్ట్ర రాజకీయాల్లోనూ, ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్డీయేను పటిష్టంగా తీర్చిదిద్దారని వెల్లడించారు. ఆ స్ఫూర్తిని నితిన్ నబిన్ బలంగా ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్న ట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Next Story






