- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు డిన్నర్..ఎప్పుడంటే..!
ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సంక్రాంతి సందర్భంగా శనివారం రాత్రి చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సంక్రాంతి సందర్భంగా శనివారం రాత్రి చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఇద్దరూ కలిసి భోజనం చేయనున్నారు. ఇందుకోసం తన నివాసానికి రావాలని పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలపై ఈ సందర్బంగా చర్చించనున్నారు. పొత్తులో భాగంగా సీట్లు, ఉమ్మడి మేనిఫెస్ట్ రూపకల్పనపై ఈ భేటీలో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భోగి రోజు ఉమ్మడిగా ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేయనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన పలు జీవోలను వ్యతిరేకిస్తూ ఆ ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున అమరావతి ప్రాంతం మందడంలో జరిగే భోగి కార్యాక్రమంలో చంద్రబాబు, పవన్ పాల్గొననున్నారు.
Next Story






