- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: ఇంచార్జి సీఎంగా పవన్ కల్యాణ్.. ఆ నాలుగు రోజులే ఛాన్స్..?
సీఎం సింగపూర్ టూర్ నేపథ్యంలో ఇంచార్జి ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌కు అప్పటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఓ ప్రచారం వైరల్ అవుతోంది. రాష్ట్ర ఇంచార్జి ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉండబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) నాలుగు రోజులు పాటు సింగపూర్(Singapoor)లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జి సీఎంగా పవన్‌కు బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 26 నుంచి 30 వరకూ చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుతో మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్ సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ముఖ్యమంత్రి టూర్‌కు వెళ్లినప్పుడు ఇంచార్జి బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. కాకపోతే గతంలో ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్‌ను ఇంచార్జిగా నియమించారు. అయితే ఆ తర్వాత వివాదంకావడంతో తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల గండం ఉందనే ప్రచారం జరిగింది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ఇంచార్జి సీఎం బాధ్యతలు అప్పగిస్తారనేది ప్రచారం మాత్రమే. అధికారిక ప్రకటన వస్తే తప్ప నిజమని నమ్మలేమని పలువురు విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.






