- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వ్యక్తిని పరిచయం చేసిన పవన్ కళ్యాణ్..ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ!?
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా(Social Media) వేదికగా ఓ వ్యక్తిని పరిచయం చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా(Social Media) వేదికగా ఓ వ్యక్తిని పరిచయం చేశారు. పవన్ కళ్యాణ్ తన మిత్రుడిని 34 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ మేరకు ఆయన ఇద్దరు కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 1990 లో పవన్ కళ్యాణ్ కోలీవుడ్ నటుడు, కరాటే శిక్షకుడు షిహాన్ హుసైని వద్ద మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను కరాటే శిక్షణ పొందిన దగ్గరే ట్రైనింగ్ తీసుకున్న తన సీనియర్ తిరు రేన్షి రాజాను తాజాగా పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రేన్షి రాజా(Renshi raja)ది తమిళనాడు అని తెలిపారు. కరాటే స్కూల్‌లో తాను గ్రీన్ బెల్ట్ సాధిస్తే.. ఆయన బ్లాక్ బెల్ట్ సాధించారని చెప్పారు. రేన్షి రాజాను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను పవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాము ఏ కరాటే స్కూల్‌లో అయితే శిక్షణ పొందారో దాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న రాజాను పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ నేపథ్యంలో తమ గురువు హుసైనితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తమ గురువు హుసైని బ్లడ్ క్యాన్సర్ తో పోరాడి ఈ ఏడాది మార్చిలో మరణించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.






