- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాహేతర సంబంధాలు పార్టీపై రుద్దే ప్రయత్నం.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ అలర్ట్
జనసేనపై ఎటువంటి దుష్ట శక్తుల దృష్టి సోకకుండా అప్రమత్తంగా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు సర్వదా ప్రశంసనీయులని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేనపై ఎటువంటి దుష్ట శక్తుల దృష్టి సోకకుండా అప్రమత్తంగా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు సర్వదా ప్రశంసనీయులని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీకి చెందిన కొందరు నాయకులతో సమావేశమైన ఆయన, సంస్థాగత అంశాలపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించేందుకు కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వంటి అంశాలను కూడా పార్టీపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రయాణంలో తోడు నీడగా నిలుస్తున్న జనసేన శ్రేణులందరికీ తన కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని వేళలా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, సంస్థ ప్రతిష్ఠను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి దేనని పవన్ కల్యాణ్ సూచించారు.
Read More..






