అనిత వంగలపూడి గొప్ప మ‌న‌సు..లేడీ కానిస్టేబుల్ ను పిలిపించి మ‌రీ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-22 07:41:05  IST  )

కానిస్టేబుల్ జయశాంతిని పిలిపించుకుని స‌న్మానించారు అనిత‌.

అనిత వంగలపూడి గొప్ప మ‌న‌సు..లేడీ కానిస్టేబుల్ ను పిలిపించి మ‌రీ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర హోమ్ మంత్రి అనిత వంగలపూడి మ‌రోసారి గొప్ప మనసు చాటుకున్నారు. కానిస్టేబుల్ జయశాంతిని పిలిపించుకుని స‌న్మానించారు అనిత‌. రెండు రోజుల క్రితం తన చంటి బిడ్డనెత్తుకుని ట్రాఫిక్ విధుల్లో పాల్గొన్నారు కానిస్టేబుల్ జయశాంతి. త‌న డ్యూటీ కాక‌పోయినా దారిలో ట్రాఫిక్ ఉంటే, క్రియ‌ర్ చేశారు రంగంపేటకు చెందిన కానిస్టేబుల్ జయశాంతి. ఈ త‌రుణంలోనే కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్ క్లియ‌ర్ చేసిన వీడియో వైర‌ల్ గా మారింది.

ఈ నేప‌థ్యంలోనే కానిస్టేబుల్ జయశాంతిని ఇప్పటికే ఫోన్ లో అభినందించారు అనిత వంగలపూడి. అయితే, నేరుగా కలవాలని ఉందని అనిత‌ను కోరారు జ‌య‌శాంతి. దీంతో ఇవాళ విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హోమ్ మంత్రిని కుటుంబ సమేతంగా కలిశారు కానిస్టేబుల్ జయశాంతి దంప‌తులు. ఈ సంద‌ర్భంగా వారితో కలిసి భోజనం చేశారు మంత్రి అనిత‌. అనంత‌రం కానిస్టేబుల్ దంపతులకు బట్టలు పెట్టిన హోమ్ మంత్రి అనిత..స‌న్మానించారు. ఈ సంఘ‌ట‌న సంబంధించి ఫోటోలు వైర‌ల్ గా మారాయి. దీంతో హోమ్ మంత్రి అనిత వంగలపూడి చేసిన ప‌నిని అంద‌రూ మెచ్చుకుంటున్నారు.





Next Story