Pawan Kalyan : తమిళనాడు మురుగన్ ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-15 06:29:48  IST  )

ఏపీ(AP) డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)దక్షిణ భారత ఆలయాల సందర్శన(Visiting South Indian temples)లో భాగంగా శనివారం ఉదయం తమిళనాడు రాష్ట్రం పాలముదిరచోలైలోని సోలమలై మురుగన్ ఆలయం(Solamalai Murugan Temple)ను దర్శించుకున్నారు

Pawan Kalyan : తమిళనాడు మురుగన్ ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)దక్షిణ భారత ఆలయాల సందర్శన(Visiting South Indian temples)లో భాగంగా శనివారం ఉదయం తమిళనాడు రాష్ట్రం పాలముదిరచోలైలోని సోలమలై మురుగన్ ఆలయం(Solamalai Murugan Temple)ను దర్శించుకున్నారు. కుమారుడు అకీరానందన్ తో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ వెంట అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ ఆనంద్ సాయి ఉన్నారు.

తిరుత్తణి దర్శనంతో యాత్ర పూర్తి

మురుగన్ దర్శనం అనంతరంపవన్ కళ్యాణ్ ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా ఇప్పటివరకు అయిదు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాల దర్శనం పూర్తయిందని, సాయంత్రం తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర సందర్శనతో షణ్ముఖ యాత్ర పూర్తవుతుందని చెప్పారు.

పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు...

మురుగన్ దర్శనం అనంతరం బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఆలయ పారిశుధ్య కార్మికులను చూసి తన కాన్వాయ్ ను ఆపి వారితో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగి ఆర్థిక సాయం అందించారు. అంతకుముందు తమిళనాడు పర్యటనలో మధుర మీనాక్షి అమ్మవారిని, సోమసుందరేశ్వరుడిని దర్శించుకుని చీరసారెలు, ఫల పుష్పాలు సమర్పించారు.

సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణ భారత దేశంలోని ఆలయాల సందర్శన చేపట్టిక పవన్ కల్యాణ్ కేరళలోని ఆలయాలను సందర్శన అనంతరం తమిళనాడులోని ఆలయాలను పవన్ సందర్శిస్తున్నారు. తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని, తిరుప్పరకుండ్రంలో ఉన్న శ్రీ మురుగన్ స్వామి ఆలయాన్ని, వేద పాఠశాలను సందర్శించారు. తమిళనాడులోని తంజావూరు, కుంభకోణం, తిరుచ్చెందూర్‌ ఆలయాలను సందర్శించారు.

Next Story