Pawan Kalyan: అల్లు కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్

by Ramesh Naini |

దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే.

Pawan Kalyan: అల్లు కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (Kanakaratnamma) నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. విషాదంలో ఉన్న అల్లు కుటుంబ సభ్యలను ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విశాఖపట్నంలో జనసేన బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆయన హైదరాబాద్‌లోని అల్లు నివాసానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆయన అల్లు అరవింద్ (Allu Aravind), అల్లు అర్జున్‌ (Allu Arjun)లను పరామర్శించి ఓదార్పు నిచ్చారు. ఈ సందర్భంగా కనక రత్నమ్మతో తనకున్న అనుబంధాన్ని పవన్ కల్యాణ్ గుర్తుకు చేసుకున్నారు.

Next Story